Kochi Airport: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన హెలికాఫ్టర్

Kochi Airport: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది.

Arun Chilukuri
Updated on: 26 March 2023 4:45 PM IST
Coast Guards ALH Dhruv Helicopter Crashes Near Kochi Airport
X

Kochi Airport: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన హెలికాఫ్టర్

Kochi Airport: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. అది ఒక ALH ధ్రువ్ మాక్-3 శిక్షణ హెలికాఫ్టర్ అని తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో ముగ్గురు వ్యక్తులున్నారని.. అందులో ఓ వ్యక్తికి చేయి విరిగినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. ఫోర్స్ ల్యాండ్ అయిన సమయంలో హెలికాఫ్టర్ 25 అడుగుల ఎత్తులో ఉంది. ALH ధ్రువ్ హెలికాఫ్టర్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. హెలిప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే శిక్షణ విమానం కూలిపోయే క్రమంలో పైలట్ నేర్పుతో మెయిన్ రన్ వే పక్కకు ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పైలట్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story