Sanatan Dharma: ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సమర్థించిన సీఎం స్టాలిన్‌

CM Stalin Supported Udhayanidhi Stalin Comments
x

Sanatan Dharma: ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సమర్థించిన సీఎం స్టాలిన్‌ 

Highlights

Sanatan Dharma: వెనకబడిన కులాలు, ఆదివాసీలు, మహిళలపై వివక్ష గురించి ఉదయనిధి మాట్లాడారు

Sanatan Dharma: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీతో పాటు పలు హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. తన కుమారుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను స్టాలిన్‌ సమర్థించారు. సనాతన ధర్మంలో కొన్ని అసమానతలపైనే ఉదయనిధి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు.

వీటికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బీజేపీ అనుకూల శక్తులు సహించలేక పోతున్నాయన్నారు. అందుకే ఉదయనిధిని లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని.. అటువంటి వారితో ప్రధాని మోదీ కూడా ఎందుకు ఏకీభవిస్తున్నారో అర్థం కావడం లేదని స్టాలిన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘సనాతన ధర్మం బోధించిన సూత్రాల్లో కొన్ని సూత్రాలపై ఉదయనిధి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వెనకబడిన కులాలు, ఆదివాసీలు, మహిళలపై వివక్ష గురించి ఆయన మాట్లాడారు. అంతేకాని ఏ వర్గాన్నీ, ఎవరి మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం కాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. కొన్ని బీజేపీ అనుకూల మూకలు.. ఉత్తరాది రాష్ట్రాల్లో దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అభ్యంతరకర పదాన్ని’ ఉదయనిధి ఎప్పుడూ వాడలేదని స్టాలిన్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు అదే అబద్ధాన్ని చెప్పడం శోచనీయమన్నారు. జాబిల్లిపై చంద్రయాన్‌ను విజయవంతంగా పంపించిన నేటి కాలంలోనూ.. కొంతమంది కుల వివక్షను ప్రచారం చేయడం దారుణమని స్టాలిన్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories