నిన్న యువకుడిని భుజంపై మోసుకెళ్లిన రాజేశ్వరిని సన్మానించిన సీఎం స్టాలిన్

Tamil Nadu: ఇన్‌స్టెక్టర్ రాజేశ్వరిపై సీఎం స్టాలిన్ ప్రశంసలు

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 3:50 PM IST
CM Stalin Honoring Rajeshwari for Carrying the Young Man on her Shoulder
X
వ్యక్తిని భుజంపై మోసుకెళ్లిన ఇన్స్పెక్టర్ రాజేశ్వరిని సన్మానించిన ముఖ్యమంత్రి స్టాలిన్

Tamil Nadu: చెన్నైలో స్రృహ తప్పిపడిపోయిన యువకుడిని కాపాడిన ఇన్‌స్టెక్టర్ రాజేశ్వరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం రాజేశ్వరిని తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించి, సన్మానించారు. విప్తక్తర పరిస్థితుల్లో ఆమె చూపిన దాతృత్వం ఎందరికో స్పూర్తి అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కాగా భారీ వర్షాలు, ఈదురు గాలులకు నిన్న టీపీ చట్రం ప్రాంతంలోని స్మశానవాటికలో ఉదయ్ కుమార్ అనే యువకుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడు చనిపోయాడనుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న రాజేశ్వరి యువకుడిలో కదలికలు గుర్తించి భుజంపైనే మోసుకొని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story