Mysore Dasara Celebrations 2023: కన్నులపండువగా 'జంబూ' సవారీ.. బంగారు అంబారీపై అమ్మవారి ఊరేగింపు

Mysore Dasara Celebrations 2023: వేడుకలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే

Shekhar G
Updated on: 24 Oct 2023 7:16 PM IST
CM Siddaramaiah And DK Shivakumar Attended Jamboo Savari
X

Mysuru Dasara Celebrations 2023: కన్నులపండువగా 'జంబూ' సవారీ.. బంగారు అంబారీపై అమ్మవారి ఊరేగింపు

Mysore Dasara Celebrations 2023: కర్నాటకలోని మైసూర్‌లో దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. మైసూర్ మహారాజ్ ప్యాలెస్ పరిసర ప్రాంతాలు.. జనంతో కిక్కిరిసిపోయాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మైసూర్ మహారాజు కాలం నాటి నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు అంగరంగ వైభంగా జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాల సందర్భంగా యువరాజు ఆయుధ పూజ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంబారీ ఊరేగింపు ప్రారంభమైంది. చాముండేశ్వరి దేవిని అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేసి అంబారీపై ఊరేగిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుండగా.. సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉత్సవాల్లో పాల్గొని జంబూ ఊరేగింపును ప్రారంభించారు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలమూల నుంచి భక్తులు తరలిరావడంతో ప్యాలెస్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

Shekhar G

Shekhar G

Next Story