Delhi: నేడు ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

* రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చించనున్న సీఎం * రేపు కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కేసీఆర్ భేటీ

Sandeep Reddy
Published on: 3 Sept 2021 12:02 PM IST
CM KCR Meets Prime Minister Modi and Union Irrigation Minister Today 03 09 2021
X

నేడు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ (ఫైల్ ఫోటో)

CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలు, కేంద్ర గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. ఇక రేపు ఢిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story