KCR Delhi Tour: ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన
* కేంద్ర జలశక్తిశాఖ మంత్రి షెకావత్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ * దాదాపు 40 నిమిషాల పాటు సాగిన సమావేశం
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ భేటీ(ఫోటో- ది హన్స్ ఇండియా)
KCR Delhi Tour: ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం సాగింది. నెలరోజుల వ్యవధిలో షెకావత్‌తో రెండోసారి సమావేశమైన కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.
సీఎం కేసీఆర్‌తో భేటీపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ట్వీట్ చేశారు. జల్‌జీవన్ మిషన్, హర్ ఘర్ జల్ పథకాల అమలుపై చర్చ జరిగిందన్నారు. వీటితో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించామని ట్వీట్‌లో తెలిపారు షెకావత్.
Next Story




