CM KCR: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ ఫోకస్

CM KCR: బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు సన్నాహాలు ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడిన సీఎం కేసీఆర్.

Sriveni Erugu
Published on: 17 Feb 2022 8:01 AM IST
CM KCR‌ Focus on National Politics
X

 CM KCR: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ ఫోకస్

CM KCR: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయలపై ఫోకస్ పెట్టారు. బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా నెల రోజులుగా జాతీయ నేతలతో చర్చలు జరుపుతున్నారు. లెఫ్ట్ పార్టీ అగ్రనేతలతో ఇప్పటికే చర్చించిన కేసీఆర్ తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈనెల 20న మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. కేసీఆర్ ది న్యాయ మైన పోరాటమని.. విభజన శక్తులపై యుద్ధం చేసేందుకు కేసీఆర్ గ ళం విప్పార ని ఉద్దవ్ ఠాక్రె అన్నారు. సరైన సమయంలో కేసీఆర్ ముందుకు వచ్చారని ఉద్దవ్ తెలిపారు. దేశ ప్రజలందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేందుకు తాము సంపూర్ణ సహ కారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కు హామీ ఇచ్చారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story