Narendra Modi: ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

Narendra Modi: ఎన్నికలకు ముందు కీలకంగా మారిన ఇరువురు నేతల భేటీలు

Shekhar G
Updated on: 9 Feb 2024 2:21 PM IST
CM Jagan Meeting With Prime Minister Modi Ended
X

Narendra Modi: ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

Narendra Modi: ఏపీకి పాలిటిక్స్‌ ఢిల్లీకి మారాయి. చంద్రబాబు నిన్న అమిత్ షాను కలవడం.. సీఎం జగన్ ఇవాళ ప్రధాని మోడీని కలవడం ఉత్కంఠ రేపుతోంది. ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిన్న అమిత్‌షా ను కలవడం.. ఇవాళ సీఎం జగన్ ప్రధాని మోడీని కలవడం ఉత్కంఠగా మారింది. ఎన్నికలకు ముందు ఇరువురు నేతల భేటీలు కీలకంగా మారాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్‌ చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను సైతం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story