బెంగళూరులో సా.5.30 గంటలకు సీఎల్పీ సమావేశం

* హాజరుకానున్న ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, సిద్దరామయ్య, డీకే శికుమార్‌

Dhatripriya
Updated on: 14 May 2023 9:32 AM IST
CLP Meeting In Bangalore Today
X

బెంగళూరులో సా.5.30 గంటలకు సీఎల్పీ సమావేశం

Bengaluru: బెంగళూరులో సాయంత్రం 5.30 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ రనదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శికుమార్‌తో పాటు.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన 136 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు స్వతంత్రులు హాజరుకానున్నారు.

వీరంతా సీఎల్పీ లీడర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కర్ణాటక సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. సీఎం రేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ ఉన్నారు. దీంతో.. హైకమాండ్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు... ఇప్పటికే సీఎంగా సిద్దరామయ్య ఎన్నిక దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక.. కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎంతో పాటు.. కీలకమైన పోర్ట్‌ ఫోలియో అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రేపు కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కంఠీరవ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు జరగుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story