వామ్మో.. అంతమంది అమ్మాయిలా.. పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి..

Class 12 Student Manish Shankar Fainted After seeing Girls in Exam Centre in Bihar
x

వామ్మో.. అంతమంది అమ్మాయిలా.. పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి..

Highlights

Viral News: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు.

Viral News: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో చోటు చేసుకుంది. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. మనీశ్‌ శంకర్‌(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. మనీశ్‌ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్‌ ప్రసాద్‌ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌కు తీసుకొచ్చాడు. అయితే.. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్​లోకి వెళ్లాడు.

అక్కడ అంతా అమ్మాయిలు ఉండేసరికి.. ఆశ్చర్యపోయాడు. పరీక్షా కేంద్రంలో 500 మందికి పైగా బాలికలు ఉండగా.. అబ్బాయి మాత్రం మనీశ్‌ ఒకడే. అతని చూసి అమ్మాయిలంతా ఒక్కసారిగా ఘోల్లుమనడంతో.. అర్థంకాని అయోమయంలో ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు మనీశ్​. దీంతో అతన్ని సర్దార్‌ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు పరీక్షా నిర్వాహకులు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories