Bhawanipur: భవానీపూర్‌‌లో ఉద్రిక్తత.. నకిలీ ఓట్లు వేస్తున్నారంటూ..

Bhawanipur: వెస్ట్ బెంగాల్ భవానీపూర్‌ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.

Arun Chilukuri
Published on: 30 Sept 2021 6:50 PM IST
Clash Between TMC BJP Workers in Bhawanipur
X

Bhawanipur: భవానీపూర్‌‌లో ఉద్రిక్తత.. నకిలీ ఓట్లు వేస్తున్నారంటూ..

Bhawanipur: వెస్ట్ బెంగాల్ భవానీపూర్‌ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయంలో బీజేపీ-టీఎంసీ నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ ఘర్షణల్లో బీజేపీ నేత కళ్యాణ్ చౌబేర్ కారు ధ్వంసమైంది. ఇదే సమయంలో బీజేపీ-టీఎంసీ కార్యకర్తలకూ తీవ్ర గాయాలయ్యాయి. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలనూ చెదరగొట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story