జైల్లో ఉన్న సినీ తారల మధ్య గొడవ.. బయటకు పరుగులు తీసిన ఇతర ఖైదీలు

Raj
By Raj
Updated on: 11 Oct 2020 8:33 AM IST
జైల్లో ఉన్న  సినీ తారల మధ్య గొడవ.. బయటకు పరుగులు తీసిన ఇతర ఖైదీలు
X

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సినీ తారల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైల్లో సినీతారలు సంజనా, రాగిణి ఇద్దరూ పెద్దగా కేకలు వేసుకుంటూ తోసుకున్నారని.. అలాగే ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకున్నారని విషయం బయటకు వచ్చింది. దీంతో జైలు లోపల ఉన్న ఇతర మహిళా ఖైదీలు బయటకు పరుగులు తీశారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన కారాగారం సిబ్బంది ఇద్దరిని శాంతింప చేసేందుకు ప్రయత్నించారని సమాచారం. నీ వల్లే ఈ పరిస్థితి ఎదురైంది అంటే నీవల్లే అంటూ సంజనా,రాగిని ఇద్దరు ఒకరిపై ఒకరు గొడవకు దిగినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో కొట్టుకునే వరకు పరిస్థితి రావడంతో ఇద్దరినీ వేరువేరు బ్యారక్ లలో ఉంచి వారికి ఇద్దరు మహిళా ఖైదీలను రక్షణ గా ఉంచినట్టు తెలుస్తోంది. మరోవైపు శనివారం జైల్లోనే పుట్టినరోజు జరుపుకున్న సంజనాకు.. ఇతర ఖైదీలు, జైలు ఉద్యోగులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. కాగా గతంలో కేపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా రాగిణి, సంజన మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని అప్పటినుంచి వారిద్దరు మాట్లాడుకోవడం లేదని పరిశ్రమలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఆ గొడవలు మరింత తీవ్రం అయ్యాయి.

Raj

Raj

Next Story