Narendra Modi: వికసిత్ భారత్ దిశగా ప్రస్థానంపై సీఐఐ సదస్సు

Narendra Modi: సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 July 2024 9:45 PM IST
CII conference on moving towards a developed India Says PM Modi
X

Narendra Modi: వికసిత్ భారత్ దిశగా ప్రస్థానంపై సీఐఐ సదస్సు

Narendra Modi: బడ్జెట్‌ మెరుగ్గా ఉందని చూపేందుకు UPA ప్రభుత్వం మెరుగులు దిద్దేదని... కాని క్షేత్రస్థాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని మోడీ ఆరోపించారు. వికసిత్ భారత్ దిశగా ప్రస్థానం అనే అంశంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ప్రధాని పాల్గొన్నారు. పథకాలను పూర్తి చేసేందుకు గత ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచలేదని దుయ్యబట్టారు. రైల్వే బడ్జెట్‌ను 8 రెట్లు, జాతీయ రహదారుల బడ్జెట్‌ను 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్‌ను 4 రెట్లు పెంచామన్నారు. రక్షణ బడ్జెట్‌ను రెండింతలకుపైగా పెంచామని చెప్పుకొచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story