చైనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌పై భారత్‌ నిషేధం

చైనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌పై భారత్‌ నిషేధం
x
Highlights

చైనా టెస్ట్ కిట్స్‌పై.. భారత వైద్య మండలి కీలక ప్రకటన చేసింది. డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ను ఉపయోగించరాదని అన్ని...

చైనా టెస్ట్ కిట్స్‌పై.. భారత వైద్య మండలి కీలక ప్రకటన చేసింది. డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ను ఉపయోగించరాదని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అంతేకాకుండా కిట్స్‌ను వెంటనే వెనక్కి పంపించాలని స్పష్టం చేసింది. కిట్లలో నాణ్యతా లోపాలున్నాయని వాటితో జరిపిన పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు రావట్లేదని తెలిపింది.

చైనా టెస్టింగ్ కిట్స్‌ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా రూపొందించిన కరోనా టెస్టింగ్ కిట్స్‌లో లోపాలు ఉండటంతో వాటిని తిరిగి పంపించాలని భారత వైద్యమండలి ICMR నిర్ణయించింది. చైనాకు చెందిన వాండ్‌ఫా బయోటెక్, జుహాయ్‌ లివ్ జోన్‌ డయాగ్నోస్టిక్స్‌ కంపెనీల నుంచి తెప్పించిన కిట్లపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ కిట్లను రాష్ట్రాలు ఇకపై వాడరాదని సూచించింది. అయితే ఈ కిట్లపై తొలుత రాజస్థాన్ సందేహాలు వ్యక్తం చేసింది. చైనా కిట్లు సత్ఫలితాలివ్వడం లేదని తెలిపింది. కిట్ల కచ్చితత్వం 10 శాతం లోపేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని చైనా టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షించినప్పుడు అతనికి నెగెటివ్ వచ్చిందని తెలిపింది. పలువురికి ఇదే ఫలితం రావడంతో ఈ కిట్ల నాణ్యతపై అనుమానం తలెత్తింది.

ఆ తర్వాత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కూడా ఈ కిట్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తూ ICMR దృష్టికి తీసుకెళ్లాయి. రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ICMR చైనా కిట్ల నాణ్యతను పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించింది. వీటిని పరిశీలించిన కమిటీ ఈ కిట్లను ప్రస్తుతానికి వినియోగించవద్దంటూ సిఫారసు చేసింది. తాజాగా చైనా కిట్లు వాడొద్దంటూ ICMR నిర్ణయించింది.

నాసిరకం టెస్టింగ్ కిట్స్ తయారుచేసిన చైనాపై ఒక్క మనదేశం నుంచే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం లేదు. ఇంతకుముందే పలుదేశాలు చైనా నుంచి ర్యాపిడ్ టెస్ట్‌ కిట్స్‌ దిగుమతి చేసుకున్నాయి. ఆయా దేశాలు కూడా చైనా కిట్స్‌పై ఫిర్యాదులు చేశాయి. స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, చెక్‌ రిపబ్లిక్‌, కెనడా వంటి దేశాలు చైనా కిట్స్‌పై ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో రంగంలోకి దిగిన చైనాకు చెందిన క్వాలిటీ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న 16 మిలియన్‌ తయారీదారులపై దాడులు చేసింది. 89 మిలియన్‌ ఫేస్‌ మాస్క్‌లు, 1.1 మిలియన్‌ పీపీఈ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories