China On Galwan Clashes: ఓ వైపు ‌ పశ్చాత్తాప వ్యాఖ్యలు.. మ‌రోవైపు కుటిల చ‌ర్య‌లు.. చైనా ద్వంద నీతి

China On Galwan Clashes: ఓ వైపు ‌ పశ్చాత్తాప వ్యాఖ్యలు.. మ‌రోవైపు కుటిల చ‌ర్య‌లు.. చైనా ద్వంద  నీతి
x

China On Galwan Clashes

Highlights

China On Galwan Clashes: హిందుమ‌హా స‌ముద్రంపై అధిప‌త్యం కోసం చైనా కుటిల ప్ర‌య‌త్నాలు చేస్తూ, సరిహద్దుల్లో సైనిక సంపత్తిని మోహరిస్తూ .. మ‌రో వైపు భార‌త్ పై ముసలి క‌న్నీరు కారుస్తుంది.

China On Galwan Clashes: హిందుమ‌హా స‌ముద్రంపై అధిప‌త్యం కోసం చైనా కుటిల ప్ర‌య‌త్నాలు చేస్తూ, సరిహద్దుల్లో సైనిక సంపత్తిని మోహరిస్తూ .. మ‌రో వైపు భార‌త్ పై ముసలి క‌న్నీరు కారుస్తుంది. చైనాకు భార‌త ఎప్పుడు శ‌త్రువు కాదంటుంది. పొరుగు దేశంతో ముప్పు కంటే స్నేహ‌మే బెటర్ అంటూ త‌న ద్వంద వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తుంది. తాజాగా జ‌రిగిన చైనా-ఇండియా యూత్ వెబినార్‌లో చైనా రాయబారి సన్ వీయ్‌డంగ్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గల్వాన్‌ ఘర్షణలో 20 మంది భారత సైనికుల ప్రాణాలను కోల్పోయ‌డం 'దురదృష్టకర సంఘటన'గా అభివర్ణించారు. ఈ దాడి జరిగిన రెండు నెలల తర్వాత చైనా ఈ పశ్చాత్తాప వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇలాంటి ఘటనల్ని ఇరు దేశాలూ కోరుకోవడం లేదని భారత్‌లోని ఆ దేశ రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఇరు దేశాల‌పై ఉందని వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు. ఘటన తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా పలు దఫాలు ఇరు దేశాల సైనికాధికారులు జరిపిన చర్చలు- వాటి ఫలితంగా చోటుచేసుకున్న పరిణామాల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు. వివాదాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ యుగంలో స్వయం సమృద్ధి సాధిస్తూనే ఇతరులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ను చైనా ప్రత్యర్థిగా కాకుండా ఓ మిత్రదేశంగా.. ముప్పుగా కాకుండా ఓ అవకాశంగా భావిస్తోందనే ఆయ‌న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయం గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories