జమ్ముకశ్మీర్‌పై చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్

జమ్ముకశ్మీర్‌పై చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్
x
Highlights

జమ్ముకశ్మీర్ చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ ఘవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జమ్ముకశ్మీర్ చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ ఘవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభిజించిన భూభాగంలో చైనా భూభాగం కూడా ఉందన్నారు. చైనా సార్వభౌమత్వాన్ని భారత్ సవాల్ చేస్తూ తమ దేశ చట్టాలను ఏకపక్షంగా మార్చిందని, చైనా సార్వభౌమత్వాన్ని భారత్ గౌరవించాలాని, రెండు దేశాలు ఒప్పందాలకు కట్టుబడి ఉండాలన్నారు. సరిహద్దు సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్ లద్దాఖ్, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చట్టవిరుద్ధమని చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. భారత సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవిస్తాయని భావిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము ఎప్పుడు తలదూర్చలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చైనాతో ఇతర దేశాలు భారత్ అంతర్గత వ్యవహారాల్లో కల్పించుకోవడం సరైంది కాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories