పొరపాటున చైనా భూభాగంలోకి ప్రవేశించిన ఐదుగురు భారతీయులు..

పొరపాటున చైనా భూభాగంలోకి ప్రవేశించిన ఐదుగురు భారతీయులు..
x
Highlights

ఈ నెల ప్రారంభంలో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల నుండి తప్పిపోయిన ఐదుగురిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ..

ఈ నెల ప్రారంభంలో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల నుండి తప్పిపోయిన ఐదుగురిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) భారతదేశానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ హ్యాండ్ఓవర్ చైనా భూభాగంలో జరిగింది.. అరుణాచల్ ప్రదేశ్ నుండి గంట సమయం పట్టే చైనా భూభాగంలోకి ఈ ఐదుగురు పొరపాటున వెళ్లారు. దాంతో కుటుంబసభ్యులు భారత ఆర్మీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు.. చైనా ఆర్మీతో సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు వారిని భారత్ కు అప్పగించడానికి చైనా సైనికులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారిని భారత్ అధికారులకు అప్పగించారు. అయితే ఇవాళ వారిని రప్పిస్తామని కేంద్ర మంత్రి కిరన్ రిజిజు శుక్రవారం ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే తప్పిపోయిన ఐదుగురు వ్యక్తులు వేటగాళ్ళు అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వారి కుటుంబసభ్యులు, స్థానికులు మాత్రం పోర్టర్లు అని చెబుతున్నారు. సైన్యం తోపాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు లాంగ్-రేంజ్ పెట్రోలింగ్ (ఎల్‌ఆర్‌పి) సమయంలో స్థానికులను పోర్టర్లు, గైడ్‌‌లుగా ఉపయోగిస్తారు. భారత్ , చైనా సరిహద్దు అయిన మక్ మహోన్ లైన్ వెంట సామాగ్రిని తీసుకెళ్లడానికి ఈ పోర్టర్ల సహాయపడతారు. అలాగే ఎక్కడ ఏ విధమైన మార్గాలు వుంటాయో గైడ్ లు వారికి వివరిస్తారు. ఇదిలావుంటే గత కొద్దిరోజులుగా భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. సరిహద్దులో శాంతిని కోరుకుంటున్న భారత్ ను చైనా రెచ్చగొట్టేలా వ్యూహాలు రచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories