Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లో దారుణం

Chhattisgarh Man Hung Upside Down From Tree
x

ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లో దారుణం

Highlights

Chhattisgarh: దొంగతనం నెపంతో యువకుడిని చిత్రహింసలు పెట్టిన యువకులు

Chhattisgarh: ఓ యువకుడిని చెట్టుకి తాళ్లతో కట్టి తల కిందులుగా వేలాడదీసి కొట్టారు కొందరు వ్యక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్‌ జిల్లాలోని ఉచ్ఛ్‌భట్టీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఒకరి ఇంట్లో చొరబడటానికి యువకుడు ప్రయత్నించడంతో అతడిని పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆయువకుడు తప్పించుకుని పారిపోవడంతో అతడిని మరుసటి రోజు పట్టుకుని చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories