హీరో సిద్ధార్థ్‌పై చెన్నై పోలీసులకు రెండు ఫిర్యాదులు

హీరో సిద్ధార్థ్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్న చెన్నై పోలీసులు

Rama Rao
Published on: 21 Jan 2022 12:11 PM IST
Chennai Police Summons Actor Siddharth over Tweet on Saina Nehwal
X

హీరో సిద్ధార్థ్‌కు చెన్నై పోలీసుల సమన్లు

Siddharth-Saina Nehwal: హీరో సిద్ధార్థకు సమన్లు జారీ అయ్యాయి. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై చెన్నై పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి. దీంతో సిద్ధార్థ్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు చెన్నై పోలీసులు రెడీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో హీరో సిద్ధార్థకు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు.

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, హీరో సిద్ధార్థ్ మధ్య ట్వీట్స్ వార్ జరుగుతోంది. ఈ ఇద్దరి ఎపిసోడ్ దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. సైనా చేసిన ఓ ట్వీట్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఏకంగా మహిళలను కించపరిచాడంటూ ఆయనపై చాలా మంది ఫైర్ అయ్యారు. ఎప్పుడూ సిద్దూ అందరిపై ఫైర్ అవుతుంటాడు. కానీ ఈ సారి అనుకోకుండా సైనా విషయంలో ఈయనే అడ్డంగా దొరికిపోయాడు.

ఓ మెట్టు దిగొచ్చి సారీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ వివాదం ఆగడం లేదు. సైనా క్షమించినా కూడా ఆమె ఫ్యాన్స్ మాత్రం వదలడం లేదు. పంజాబ్‌ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనను ప్రస్తావిస్తూ జనవరి 5న సైనా నెహ్వాల్ ఓ ట్వీట్‌ చేశారు. ''ఒక దేశ ప్రధానికే భద్రత లేకపోతే, ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోదీపై అరాచకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని ఆమె ట్వీట్‌ చేశారు.

దానికి వెంటనే సిద్ధార్థ్ కూడా నదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. జనవరి 6న సైనా ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ''చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడడానికి కొందరు రక్షకులున్నారు'' అని వ్యంగ్యం ధ్వనించేలా ట్వీట్‌ చేశారు. దీంతో హీరో సిద్ధార్థపై విమర్శలు వెల్లువెత్తాయి.

Rama Rao

Rama Rao

Next Story