చెన్నైలో కొత్త వేరియంట్ కరోనా కలకలం

Arun Chilukuri
Published on: 22 Dec 2020 11:41 AM IST
చెన్నైలో కొత్త వేరియంట్ కరోనా కలకలం
X

చెన్నైలో కొత్త రకం కరోనా కేసు కలవరపెడుతోంది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ గా తేలగా.. అతనిలో కొత్త రకం వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చి.. అక్కడ నుంచి చెన్నై చేరుకున్నట్లు తెలిపారు అధికారులు.

కొత్త వేరియంట్‌ కరోనా పంజాతో ఎయిరిండియా అప్రమత్తం

కొత్త వేరియంట్‌ కరోనా పంజాతో ఎయిరిండియా అప్రమత్తమైంది. తమ ఫ్లైట్లలో పనిచేసే ఫైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందిని ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించింది. ఇటీవల బ్రిటన్ సహా విదేశాలకు వెళ్లిన సిబ్బంది అంతా ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపింది యాజమాన్యం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story