PM Modi: మోడీతో చాట్‌జీపీటీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ భేటీ..!

PM Modi: టెక్ రంగాన్ని మెరుగుపర్చడంలో కృత్రిమ మేధ పాత్ర చాలా కీలకం

Dhatripriya
Published on: 9 Jun 2023 2:32 PM IST
ChatGPT CEO Sam Altman Meet Modi
X

PM Modi: మోడీతో చాట్‌జీపీటీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ భేటీ..!

Modi: చాట్‌జీపీటీ ని రూపొందించిన ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత టెక్ రంగాన్ని మరింత మెరుగుపర్చడంలో కృత్రిమ మేధ పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. భారత పౌరుల సాధికారత కోసం జరుగుతున్న డిజిటల్ పరివర్తనను వేగవంతం చేసే అన్ని సహకారాలను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. భారత టెక్ ప్రపంచంలో ఉన్న సామర్థ్యంపై విస్తృత చర్చ జరిగిందని శామ్‌ ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు. అలాగే కృత్రిమ మేధ వల్ల దేశం ఏ రకంగా ప్రయోజనం పొందవచ్చో కూడా చర్చించామన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలోని కీలక వ్యక్తులతో అయిన అన్ని చర్చలు ఫలవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story