CharDham Yatra: చార్‌ధామ్ యాత్ర తేదీల ప్రకటన..

CharDham Yatra: ఏప్రిల్ 27న బదరీనాథ్ యాత్ర ప్రారంభం

Dhatripriya
Published on: 20 Feb 2023 11:48 AM IST
CharDham Yatra Dates Announced
X

CharDham Yatra: చార్‌ధామ్ యాత్ర తేదీల ప్రకటన..

CharDham Yatra: ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర తేదీలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో పండితులతో చర్చించిన అనంతరం కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి యాత్రల తేదీలు, సమయాలను ఖరారు చేసింది. ఏప్రిల్‌ 20న భైరవ్‌నాథ్‌లో పూజలు చేయడంతో యాత్రలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 25 ఉదయం 6.20 గంటలకు కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంటుంది. అక్షయ తృతీయ అయిన ఏప్రిల్‌ 22న గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. బదరీనాథ్‌ యాత్ర ఏప్రిల్‌ 27న ప్రారంభం కానుంది. బదరీనాథ్‌కు ముఖద్వారంగా భావించే జోషీమఠ్‌లో ఇటీవల కొండచరియలు కూలి ఇళ్లకు పగుళ్లు ఏర్పడిన నేపథ్యంలో అందరి దృష్టీ ఈ యాత్రపై పడింది. అయితే జోషీమఠ్‌ ప్రభావం చార్‌ధామ్ యాత్రపై ఉండబోదని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ వెల్లడించారు.

Dhatripriya

Dhatripriya

Next Story