పంజాబ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Punjab: పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్‌ పార్టీ తెరదించింది.

Arun Chilukuri
Published on: 6 Feb 2022 6:10 PM IST
పంజాబ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌
X

పంజాబ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Punjab: పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్‌ పార్టీ తెరదించింది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ వైపే మొగ్గుచూపింది. చరణ్ జిత్ సింగ్ చన్నీయే తమ సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ ప్రకటించారు. పంజాబ్ లోని లూథియానాలో జరిగిన ఓ వర్చువల్ ర్యాలీలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. తద్వారా గత కొన్నిరోజులుగా సాగుతున్న చర్చకు తెరదించారు. అంతేకాదు, సీఎం అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశించిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆశలపైనా నీళ్లు చల్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story