Central Cabinet: పార్లమెంట్ సమావేశాలకు ముందే మంత్రివర్గంలో మార్పులు!

Central Cabinet: కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నేతకు అవకాశం?

Jyothi
Published on: 30 Jun 2023 11:37 AM IST
Changes in the Cabinet Before the Parliament Meetings
X

Central Cabinet: పార్లమెంట్ సమావేశాలకు ముందే మంత్రివర్గంలో మార్పులు!

Central Cabinet: కేబినెట్‌లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి జరిగే కేబినెట్ మార్పుల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందే మంత్రివర్గంలో మార్పులు జరగనుండగా..మంత్రివర్గంలో తెలంగాణ నేతకు అవకాశం ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ కంటే తెలంగాణలో నాయకత్వ మార్పుపైనే హైకమాండ్ ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కొన్నాళ్లుగా బీజేపీ జోరు తగ్గిందనే భావనలో ఉన్న హైకమాండ్.. రెడ్డి సామాజిక వర్గానికి పగ్గాలిస్తే పార్టీకి ప్లస్ అని భావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నాయకత్వ మార్పు జరిగితే ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. బండి సంజయ్‌కు చోటిస్తే మున్నూరు వర్గంలో కూడా అసంతృప్తి రాదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అటు ఏపీలో కూడా నాయకత్వ మార్పుపై ఆలోచన చేస్తోన్న హైకమాండ్.. ప్రస్తుతం సోము వీర్రాజునే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story