Chandrayan-3: భారత అంతరిక్ష చరిత్రలో సంచలన విజయం.. విజయవంతమైన చంద్రయాన్-3 ప్రయోగం..!

Chandrayan-3 Lands On Moon
x

Chandrayan-3: భారత అంతరిక్ష చరిత్రలో సంచలన విజయం.. విజయవంతమైన చంద్రయాన్-3 ప్రయోగం..!

Highlights

Chandrayan-3: భారత అంతరిక్ష చరిత్రలో సంచలన విజయం.. విజయవంతమైన చంద్రయాన్-3 ప్రయోగం..!

Chandrayan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘన విజయాన్ని సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. కోట్లాది భారతీయుల ఆశలతో నింగికెగసిన విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిపై భారత కీర్తి పతాకను ఎగరేసింది. చంద్రయాన్‌ 3 ప్రయోగం చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధృవంపై కాలుమోపింది. భారతావని కీర్తిని ప్రపంచానికి చాటింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్‌ సురక్షితంగా అడుగుపెట్టింది. నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడిపై దిగింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. చంద్రుడి నిర్మాణం, అక్కడి వాతావరణం, పరిమాణంపై చంద్రయాన్‌-3 పరిశోధించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories