చంద్రయాన్ 2 లో అద్భుత ఘట్టం

చంద్రయాన్ 2 లో అద్భుత ఘట్టం
x
Highlights

చంద్రయాన్ టూ లో అసలు సిసలు కథ ఆరంభమైంది. దాదాపుగా అన్ని దశలు విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్‌ టూ ప్రయాణంలో జాబిల్లిపై ల్యాండర్‌ దిగడమే...

చంద్రయాన్ టూ లో అసలు సిసలు కథ ఆరంభమైంది. దాదాపుగా అన్ని దశలు విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్‌ టూ ప్రయాణంలో జాబిల్లిపై ల్యాండర్‌ దిగడమే మిగిలింది. ఈ నెల 7 న జరగనున్న ఈ ఘట్టం కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది. సోమవారం ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విజయవంతంగా వీడిపోయిందని ఇస్రో ప్రకటించింది.

చందమామ రహస్యాలను అన్వేషించేందుకు ప్రయోగించిన చంద్రయాన్‌ టూ ప్రయోగంలోనే అత్యంత కీలకఘట్టం విజయవంతం అయ్యింది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ సక్సెస్‌ఫుల్‌గా వీడిపోయింది. దీంతో విక్రమ్‌ ల్యాండర్‌, అందులోని ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రమామ వైపు తన ప్రయాణానాన్ని మొదలుపెట్టాయి.

ఇక ఈ నెల 7 న చంద్రయాన్‌ టూ ప్రయోగంలోనే అత్యంత కీలక ఘట్టం ప్రారంభం అవుతుంది. చంద్రయాన్ టూ లో పవర్ డీసెంట్ దశ ప్రారంభం కానుంది. ఆ రోజున అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటా 30 నిమిషాల నుంచి 2 గంటలా 30 నిమిషాల మధ్యలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై నిర్దేశించిన ప్రాంతంలో దిగనుంది. ఆ తర్వాత ల్యాండర్‌లో నుంచి రోవర్ బయటకు వస్తుంది. ఈ 15 నిమిషాలనే ఇస్రో అత్యంత ఉత్కంఠ భరిత క్షణాలుగా ఇస్రో అభివర్ణించింది. ఆ సమయం నుంచి చంద్రుడి రహస్యాలను రోవర్‌ ఇస్రోకు పంపనుంది.

గత జూలై 22 న ప్రయోగించిన చంద్రయాన్‌ 2 అప్రతిహాతంగా దూసుకుపోతోంది. ఆగస్టు 20 న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌ టూ కక్ష్యను ఇప్పటివరకు 5 సార్లు విజయవంతంగా తగ్గించారు. ఇప్పటికే స్పేస్ క్రాఫ్ట్‌ పలు దఫాలుగా చంద్రుడి ఫోటోలను ఇస్రోకు పంపించింది. ప్రస్తుతం జాబిల్లికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బిటర్‌ నుంచి సోమవారం ల్యాండర్‌ వీడిపోయింది. మధ్యాహ్నం 12 గంటలా 45 నిమిషాల నుంచి ఒంటి గంటా 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తైంది. దీంతో స్పేస్‌ క్రాఫ్ట్‌ సేఫ్ ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు కూడా చేశారు.

అయితే 7 వ తేదీన సాఫ్ట్ ల్యాండింగ్‌పైనే ఇస్రో సైంటిస్టులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ల్యాండర్‌ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణిస్తే క్రాష్ ల్యాండింగ్‌ అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు చంద్రయాన్‌ టూ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories