Rajasthan: రెచ్చిపోతున్న చైన్‌ స్నాచర్స్‌.. కిందపడ్డా వదలకుండా ఈడ్చుకెళ్ళిన దొంగ

Rajasthan: దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ

Shekhar G
Published on: 27 Dec 2023 4:22 PM IST
Chain Snatchers On Rampage In Rajasthan
X

Rajasthan: రెచ్చిపోతున్న చైన్‌ స్నాచర్స్‌.. కిందపడ్డా వదలకుండా ఈడ్చుకెళ్ళిన దొంగ

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. చైన్‌ స్నాచర్స్‌ రెచ్చిపోతున్నారు. జైపూర్‌ సమీపంలోని చిత్రకూట్‌లో మహిళ మెడలోనుంచి మంగళసూత్రం తెంపుకుని పరారయ్యారు. చిన్నారిని ఆరుబయట ఆడిస్తుండగా బైక్‌ మీద వచ్చిన చైన్‌ స్నాచర్స్ బంగారు గొలుసుతో ఉడాయించారు. దుండగుడిని అడ్డుకునేందుకు మహిళ చాలా సేపు ప్రయత్నించారు. కింద పడ్డా వదలకుండా మహిళను ఈడ్చుకుపోయాడు దుండగుడు.. మహిళ చాలా సేపు పెనుగులాడినా లాభం లేకుండా పోయింది. చిత్రకూట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story