పానీపూరీ వివాదం: వీధి రౌడీలను మించి కొట్టుకున్న వ్యాపారులు

పానీపూరీ వివాదం: వీధి రౌడీలను మించి కొట్టుకున్న వ్యాపారులు
సాయంత్రం అయితే చాలు మనం పానీ పూరి, చాట్ కోసం తహతహలాడుతుంటాం. బండి ఎక్కడ కనబడితే అక్కడ వాలిపోతాం. చాట్ మసాలా...
సాయంత్రం అయితే చాలు మనం పానీ పూరి, చాట్ కోసం తహతహలాడుతుంటాం. బండి ఎక్కడ కనబడితే అక్కడ వాలిపోతాం. చాట్ మసాలా తినడమంటే మనకు భలే క్రేజ్.. ఉత్తరాదిన పానీపురీ, చాట్ అమ్మకాలు చాలా పెద్ద వ్యాపారం కస్టమర్ల వేట కోసం ఆకర్షించడం సహజమే కానీ.. అదికాస్తా వికృతంగా మారితే.. కొట్టుకునే దాకా వెడితే? హడలి పోతాం బతుకు జీవుడా అని అక్కడ నుంచి లంఘిస్తాం. యూపీ భాగ్ పట్ లో ఇలాంటి గొడవే జరిగింది. పానీపురి అమ్మకాల కోసం మొదలైన వివాదం కాస్తా కర్రలతో తన్నుకునే స్టేజికి వెళ్లిపోయింది. కడుపు నింపుకునేందుకు కష్టపడటం మానేసి, ఫలానా కస్టమర్ నా వాడంటే నా వాడంటూ తన్నుకున్నారు.
యూపీలోని భాగ్ పట్ బజార్‌లో రెండు పానీపూరీ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ వినియోగదారుడు అక్కడికి రావడంతో తన షాప్‌కు రావాలంటే తన షాప్‌కు రావాలంటూ ఇద్దరూ అతడిని ఆహ్వానించారు. ఈ క్రమంలో రెండు దుకాణదారుల మధ్య గొడవ మొదలైంది. వినియోగదారులను ఆహ్వానించే విషయంలో చెలరేగిన వివాదం క్షణాల్లోనే ముదిరింది. లాఠీలు, కర్రలతో ఇరు వర్గాలకు చెందిన వారు రోడ్డెక్కారు. ఇష్టం వచ్చినట్టు బాదుకున్నారు. చెప్పాలంటే వీరి గొడవతో మార్కెట్ రణరంగాన్ని తలపించింది.
రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం కాస్త భయానక దాడి వరకు వెళ్లింది. విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. నిజానికి వీధి వ్యాపారులైనా వీధి రౌడీలను మించి కొట్టుకున్నారు. వీరికి మద్దతుగా మరికొంత మంది సీన్‌లోకి దిగడంతో పెద్ద గలాటా చెలరేగింది. ఎదుటి వాడు మనకంటే ఎందులోనైనా కాస్త ఎక్కువైతే కొందరికి అదోరకమైన కడుపు మంట. ఆ మంటే అక్కడ గ్యాంగ్ వార్‌కు కారణమైంది. లాక్‌డౌన్ దెబ్బకు వీధి వ్యాపారాలన్నీ కుదేలైన వేళ అరకొరగా వస్తోన్న కస్టమర్ల కోసం దుకాణదారులు కొట్లాడుకున్న తీరు కలవరం పుట్టిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో భాగ్ పట్ లో జరిగిన ఘర్షణ నెట్టింట సంచలనంగా మారింది.
#WATCH Baghpat: Clash breaks out between two groups of 'chaat' shopkeepers over the issue of attracting customers to their respective shops, in Baraut. Police say, "Eight people arrested, action is being taken. There is no law & order situation there."
— ANI UP (@ANINewsUP) February 22, 2021
(Note: Abusive language) pic.twitter.com/AYD6tEm0Ri