లాక్‌డౌన్‌ పై మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

లాక్‌డౌన్‌ పై మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
x
Highlights

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ , ఢిల్లీ సరిహద్దులో లాక్ అయిన వలస కార్మికులను ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు లాక్ డౌన్ లో ఉంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ , ఢిల్లీ సరిహద్దులో లాక్ అయిన వలస కార్మికులను ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు లాక్ డౌన్ లో ఉంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయినా కూడా చాలా చోట్ల వలస కార్మికులు రోడ్లవెంట నడుచుకుంటూ వస్తున్నారు. పోలీసులు వారిని నిలిపివేసేందుకు ఎంత ప్రయత్నించినా రైల్వే ట్రాక్ వైపు అలాగే పోలీసులు లేని రోడ్లపై నడుచుకుంటూ వస్తున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఈ మేరకు వివిధ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 666,000 కు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి 30,900 కి పైగా కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి. ఇక భారతదేశంలో, ధృవీకరించబడిన కేసుల సంఖ్య1,000 పైగా ఉంది, అలాగే 25 మంది మరణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories