రాష్ట్రాలకు కేంద్రం ఆసరా.. SDRMF నిధులు విడుదల

రాష్ట్రాలకు కేంద్రం ఆసరా.. SDRMF నిధులు విడుదల
x
Highlights

కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు గాను కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎంఎఫ్‌) కింద ప్రత్యేక నిధులను విడుదల చేసింది.

కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు గాను కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎంఎఫ్‌) కింద ప్రత్యేక నిధులను విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలకు గాను 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆమోదం తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఇక ఈ నిధులను దేశవ్యాప్తంగా లాక్డౌన్ చర్యల కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులతో సహా నిరాశ్రయులకు ఆహారం మరియు ఆశ్రయం కల్పించాల్సిన అవసరాన్ని

సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా నిరాశ్రయులపై ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్రం సున్నితంగా చెబుతుంది. దీని ప్రకారం మార్చి 28 న, ఈ ప్రయోజనం కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్‌ను ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించింది. మరోవైపు ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. అనంతరం ఈ నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories