కోవిడ్ థర్డ్ వేవ్ దూసుకొస్తోంది.. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Centre Asks Nine States, Union Territories to Step up COVID-19 Testing
x

కోవిడ్ థర్డ్ వేవ్ దూసుకొస్తోంది.. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Highlights

Coronavirus: దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి అలర్ట్ అయింది.

Coronavirus: దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి అలర్ట్ అయింది. కొత్త కేసులు వేగంగా పెరుగుతున్న తొమ్మిది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచాలంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు చేపట్టాలని సూచిస్తూ రాష్ట్రాలకు మరోసారి లేఖ రాసింది. కేంద్రం లేఖ రాసిన రాష్ట్రాల్లో తమిళనాడు, పంజాబ్, ఒడిశా, యూపీ, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయా, జమ్మూకశ్మీర్‌, బీహార్ ఉన్నాయి.

ఓ వైపు కేసులు పెరుగుతున్నా టెస్టుల సంఖ్య పెంచకపోవడం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆశించినస్థాయిలో టెస్టులు చేయకుంటే వైరస్ వ్యాప్తిని అంచనావేయలేం అంది. వ్యాక్సినేషన్ రేటు అధికంగా ఉన్న దేశాల్లోనూ కోవిడ్ విజృంభిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ఉధృతిని ప్రారంభ దశలోనే అడ్డుకట్టవేయాలంటే కోవిడ్ టెస్టులు పెంచడం ఒక్కటే మార్గమని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదిలాఉంటే, రోజురోజుకు దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24గంటల్లోనే 90వేల కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఒక్కరోజే 495 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 2వేల 630కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, ఒమిక్రాన్‌ నిర్ధారిత కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వాస్తవ కేసుల సంఖ్య భారీగా ఉండవచ్చని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories