Central Ministers Arjun Ram Meghwal, Kailash Choudhary test positive: క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో ఇద్ద‌రు కేంద్ర‌మంత్రులు

Central Ministers Arjun Ram Meghwal, Kailash Choudhary test positive: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి మొద‌లు ‌సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం క‌రోనా బారిన పడుతున్నారు.

Karampoori Rajesh
Published on: 9 Aug 2020 11:51 AM IST
Central Ministers Arjun Ram Meghwal, Kailash Choudhary test positive:  క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో ఇద్ద‌రు కేంద్ర‌మంత్రులు
X
central ministers arjun ram meghwal, kailash choudhary test positive

Central Ministers Arjun Ram Meghwal, Kailash Choudhary test positive: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి మొద‌లు ‌సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం క‌రోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు సైతం కరోనా బారిన పడ్డారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్, కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరికి కరోనా బారిన ప‌డ్డారు. కైలాశ్ చౌదరి కూడా పరీక్ష చేయించుకుంటే.. పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షా సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సైతం క‌రోనా బారిన పడ్డారు. రెండు సార్లు టెస్ట్ చేయించుకోగా ఆయనకు రెండో సారి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన నిన్న ఆసుపత్రిలో చేరారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా టెస్ట్ చేయించుకోవాలని అర్జున్ రామ్ మేఘ్ వాల్ కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా క‌రోనా నివారణకు అప్పడాలు బాగా పని చేస్తాయని, వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించి ఆయన అందరిలో నవ్వులు పూయించారు. మరీ ముఖ్యంగా 'భా బీజీ అప్పడాలు' అంటూ వాటికి ప్రమోషన్ కల్పిస్తున్నట్జు చేతిలో వీటిని పట్టుకుని ఈ బ్రాండుకి పబ్లిసిటీ ఇచ్చినంత పని చేశారు. ఎయిమ్స్ లో ఈ మంత్రిగారికి అన్ని టెస్టులు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story