Central Government: విశాఖ ఏపీ రాజధాని కాదు.. అది ఒక నగరం మాత్రమే
* ఏపీ రాజధాని విషయంలో తప్పును సరిదిద్దుకున్న కేంద్రం * ఏపీ రాజధాని అని చెప్పడం మా ఉద్దేశం కాదు- కేంద్రం
విశాఖపట్నం (ట్విట్టర్ ఫోటో)
Central Government: ఏపీ రాజధాని విషయంలో తప్పును కేంద్రం సరిదిద్దుకుంది. జూలై 26న లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని వైజాగ్ అని సమాధానం ఇచ్చింది కేంద్రం. ఏపీ రాజధాని అని చెప్పడం తమ ఉద్దేశం కాదని విశాఖ ఏపీ రాజధాని కాదు అది ఒక నగరం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని వివరించింది.
హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన నగరం పేరును చేర్చుతున్నామన్నారు. హర్యానాలో అంబాలా, పంజాబ్‌లో జలంధర్ నగరాలను తీసుకున్నామన్న కేంద్రం.. అంబాలా, జలంధర్ నగరాలు ఆ రాష్ట్రాల రాజధానులు కాదని స్పష్టం చేసింది.
Next Story




