Election Commission: కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం

Election Commission: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలపై చర్చ

Rama Rao
Updated on: 31 Jan 2022 1:53 PM IST
Central Election Commission Meeting Today | National News Today
X

 కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం

Election Commission: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నేడు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. త్వరలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా కేసుల పెరుగుదల మధ్య ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్‌షోలు, బైక్ ర్యాలీలు, పాదయాత్రలపై ఈనెల 22న నిషేధాన్ని 31వ తేదీ వరకు పొడిగించింది ఎన్నికల సంఘం. ఇక గడువు ముగుస్తున్న నేపథ్యంలో కాసేపట్లో వర్చువల్ విధానంలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. అయితే కరోనా కేసులు తగ్గుదలతో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్ షోలపై నిబంధనలను సవరించే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.


Rama Rao

Rama Rao

Next Story