Central Cabinet meeting: ప్రధాని నివాసంలో ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ

Central Cabinet Meeting At Prime Minister Residence Today
x

Central Cabinet meeting: ప్రధాని నివాసంలో ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ 

Highlights

Central Cabinet meeting:

Central Cabinet meeting: ఇవాళ ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రుల కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీనిపై దాదాపు వారం నుంచి కసరత్తు జరుగుతూ ఉంది. గత కొంత కాలంగా సంస్థాగత మార్పులతో పాటు సెంట్రల్ కేబినెట్ మార్పులు చేయడంపై వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రివర్గం- ఇవాళ ఢిల్లీలో భేటీ కానుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధాని రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన, ఆ దేశంతో కుదుర్చుకోబోయే ఒప్పందాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ విదేశీ పర్యటన తర్వాతే కేంద్ర మంత్రి మండలి పునర్వవస్థీకరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories