కరోనా బాధితులందరినీ ఆసుపత్రుల్లో చేర్చుకోవాల్సిందే: కేంద్ర ప్రభుత్వం

Corona Patients:కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు.

Samba Siva Rao
Updated on: 8 May 2021 9:08 PM IST
CORONA VIRUS
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Corona Patients: క‌రోనా వైర‌స్ సెంక‌డ్ వేవ్ కొన‌సాగుతుంది. దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు కొవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. క‌రోనా రోగుల‌ను ఆస్ప‌త్రుల్లో చేర‌డానికి అనేక అవ‌స్త‌లు ప‌డుతున్నారు. కొన్ని ఆస్పత్రులు రోగుల‌ను అడ్మిట్ చేసుకోవ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కలిగేలా కరోనా పేషెంట్స్ విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తమ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర మార్గదర్శకాలు :

కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు. అనుమానం ఉన్న బాధితులందరినీ చేర్చుకుని, చికిత్స అందించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఏ కారణం వల్లా బాధితుడికి వైద్యం నిరాకరించరాదు. ఇతర ప్రాంతాలకు చెందిన రోగులకు కూడా అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందించాలని తెలిపింది. గుర్తింపు కార్డులు లేకున్నా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే కారణంతో బాధితులను చేర్చుకోకుండా ఉండకూడదు అదేశించింది.

ఇక డిశ్చార్జ్ పాలసీని ఆసుపత్రులు కచ్చితంగా పాటించాలి. హాస్పిటల్ సేవలు అవసరం లేని వారిని డిశ్చార్జ్ చేయాలి. అన్ని రాష్ట్రాల సీఎస్ లు మూడు రోజుల్లోగా ఈ నిబంధనలను అనుసరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రం తాజా మార్గ‌ద‌ర్శ‌కాల్లో పెర్కొంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story