CEC of India: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర పాండే

CEC of India: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి అనూప్‌చంద్ర పాండేను ప్రభుత్వం నియమించింది.

Kranthi
Published on: 9 Jun 2021 11:25 AM IST
Anup Chandra Pandey Appointed as Chief Election Commissioner of India
X

New CEC commissioner Anup Chandra Pandey

CEC of India: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి అనూప్‌చంద్ర పాండేను ప్రభుత్వం నియమించింది. అనూప్ చంద్ర పాండే 1984 ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్‌ అధికారి. ఎన్నికల కమిషన్‌లో అనూప్‌ చంద్ర పాండే మూడేళ్ల పాటు ఉండనున్నారు. 2024 ఫిబ్రవరి వరకు ఆయన పదవీ కాలం ఉంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనూప్‌ చంద్ర పాండే 2019లో పదవీ విరమణ పొందారు.

ఎన్నికల కమిషనర్ గా సునీల్ అరోరా పదవీకాలం ముగియడంతో ఏప్రిల్ 12న పదవీ విరమణ చేశారు. దీంతో పోల్ ప్యానెల్లో ఖాళీ ఏర్పడింది. ముగ్గురు సభ్యులు గల ఎన్నికల కమిషన్‌లో ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర, కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ ఉన్నారు. ప్రస్తుతం సునీల్ అరోరా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. రాజీవ్కుమార్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతున్నారు. ఎన్నికల సంస్కరణపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సీఈసీ సుశీల్ చంద్ర కేంద్రానికి లేఖ రాసిన రోజే కొత్త కమిషనర్ నియామకం జరగడం గమనార్హం.

Kranthi

Kranthi

Next Story