Bipin Rawat: మరణానికి ముందు బిపిన్ రావత్ సంచలన ప్రకటన

CDS Bipin Rawat Warns Against Biological Warfare
x

Bipin Rawat: మరణానికి ముందు బిపిన్ రావత్ సంచలన ప్రకటన

Highlights

Bipin Rawat: ముందు చూపుతో వ్యవహరించే సమర్ధత బిపిన్ రావత్ సొంతం.. దేశంలోకి చొరబడే శత్రువులను మట్టుపెట్టడంలో..

Bipin Rawat: ముందు చూపుతో వ్యవహరించే సమర్ధత బిపిన్ రావత్ సొంతం.. దేశంలోకి చొరబడే శత్రువులను మట్టుపెట్టడంలో, దెబ్బకొట్టడంలో వ్యూహాలు రచించడంలో బిపిన్ రావత్ దిట్ట. ప్రపంచానికి రానున్నరోజుల్లో జీవాయుధాల ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. కరోనాతోనే అది ప్రారంభమైందని అలాంటి ముప్పు ఎప్పుడొచ్చినా తిప్పికొట్టేందుకు, పోరాడేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని రావత్ పిలుపునిచ్చారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఫానెక్స్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పూనేలో ఈనెల 20, 22 తేదీల్లో విపత్తు నిర్వహణ పై జరగనున్న సదస్సుకు ముందు జరిగిన ఈ ప్రిపరేటరీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రమాదాన్ని పసిగట్టి ముందే హెచ్చరించి సన్నద్ధం చేసే రావత్ ఇలా ప్రమాదం పాలై మరణించడం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories