CBSE syllabus reduce will effect students future: సిలబస్ తగ్గింపుతో భవిష్యత్ లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?

CBSE syllabus reduce will effect students future: సిలబస్ తగ్గింపుతో భవిష్యత్ లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?
x
Highlights

CBSE syllabus reduce will effect students future: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

CBSE syllabus reduce will effect students future: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం నష్టపోయిన వేళ విద్యార్థుల పై భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ కుదింపునకు చర్యలు చేపట్టింది. ఈ సిలబస్ తగ్గింపుతో విద్యార్థులకు అన్యాయం జరగుతుందని విద్యావేత్తలు అంటున్నారు.

కరోనా వల్ల మార్చి 16 నుంచి దేశంలో విద్యా సంస్థలు మూతబడ్డాయి. జూలై 31 వరకు విద్యా సంస్థలపై ఆంక్షలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే స్కూళ్లు తెరవగానే 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని సీబీఎస్‌ఈకి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది. లాక్‌డౌన్‌తో విద్యా సంవత్సరం కోల్పోయిన నష్టాన్ని ఈ విధంగా పూడ్చాలని భావిస్తున్నట్లు హెచ్‌ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అలాగే కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ - 10, 12 తరగతులకు సంబంధించిన సిలబస్‌ను 25 శాతం తగ్గిస్తున్ననట్టుగా ఇప్పటికే ప్రకటించింది.

అయితే సిలబస్ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు విద్యావేత్తలు. తొలగించిన పాఠ్యాంశాలను పరిశీలిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుందంటున్నారు. దీనివల్ల విద్యార్థలకు తీరని నష్టం జరుగనుందని వాపోతున్నారు.

ప్రస్తుతం ఇంకా విద్యాసంవత్సరమే ప్రారంభించలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత లేదు. కానీ ముందుగానే ఇలా సిలబస్ తగ్గించటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభించిన తర్వాత పనిదినాలు ఎన్నున్నాయో పరిశీలించి అందుకనుగుణంగా సిలబస్ ను కుదించుకోవచ్చు అని చెబుతున్నారు.

ఈ చర్యలు విరమించుకోవాలని తెలంగాణ లోని పలు ఉపాధ్యాయులు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిలబస్ తగ్గించే విషయమై ఆలోచిస్తుంది. జాతీయ స్థాయిలో స్పష్టత వచ్చాక రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల విద్యార్థులు స్కూల్ మరచిపోయారు. కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. మరి వచ్చే రెండు నెలల్లోనైనా ప్రభుత్వం స్కూళ్లు ప్రారంభమిస్తుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories