సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్రం

Arun Chilukuri
Updated on: 31 Dec 2020 9:15 PM IST
సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్రం
X

విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ ప్రకటించారు. మే 4 నుంచి జూన్‌ 10 వరకు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మార్చి 1నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని స్పష్టంచేశారు. జూలై 15న పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. పరీక్షల డేట్‌ షీట్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు.

విద్యారంగంపై కోవిడ్ ప్రభావం చూపడంతోపాటు కొత్త స్ట్రెయిన్‌ కలకలం రేపింది. దీంతో పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అనేకమంది స్టూడెంట్స్ సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేయాలని మంత్రిని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. ప్రిపేర్ అవడానికి సమయం ఇచ్చేలా మే నెలలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు సరిగా జరగడంలేదని వాపోయారు. విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రమంత్రి డాక్టర్‌ రమేశ్‌ పోఖ్రియాల్‌ మే 4 నుంచి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story