గోవా పోలీసులకు సవాల్ విసురుతున్న సోనాలి మర్డర్ మిస్టరీ

CBI to Take Over Probe Sonali Phogat Death Case
x

గోవా పోలీసులకు సవాల్ విసురుతున్న సోనాలి మర్డర్ మిస్టరీ 

Highlights

గోవా పోలీసులకు సవాల్ విసురుతున్న సోనాలి మర్డర్ మిస్టరీ

Sonali Phogat Death: క్రైమ్ మూవీలో కూడా కనిపించని ట్విస్టులు, ఇంటరాగేషన్‌లో సస్పెన్స్‌ థ్రిల్లర్లు, పోలీసులకే మతిపోయే మలుపులు ఇలా టిక్ టాక్ స్టార్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌ బీజేపీ లీడర్‌ సోనాలి ఫోగట్ మర్డర్ మిస్టరీ రోజుకోరకంగా టర్న్ తీసుకుంటోంది. అనుమానాస్పద స్థితిలో మరణించిన సొనాలీ ఫొగాట్ కేసును ఛేదించే క్రమంలో గోవా పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో కేసును సీబీఐకి అప్పగించేందుకు రెడీ అని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. కేంద్ర సంస్థ చేత విచారణకు తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గత సోమవారం గోవాలోని ఓ పబ్‌లో సోనాలి ఫోగట్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. తొలుత గుండెపోటుతో ఆమె మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు సీసీ టీవీ ఫూటేజ్ లభించింది. దీంతో పోలీసుల విచారణ టర్న్ తీసుకుంది. మరోవైపు పోస్ట్ మార్టం నివేదికలో ఆమె శీరీరంపై గాయాలున్న విషయం బయటపడటంతో ఇది సహజ మరణం కాదని హత్య అనే ఆరోపణలకు బలం చేకూరినట్లైంది. దీంతో మర్డర్ కేసు నమోదు చేసిన గోవా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగిన డ్రింక్‌లో డ్రగ్స్ కలిపారని అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు నిర్ధారించారు.

ఇలా రోజుకొక ట్విస్ట్ బయటపడుతుండగా ఇప్పటివరకు ఈ కేసులో గోవా పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆమె పర్సనల్ అసిస్టెంట్ సుఖ్విందర్‌సింగ్‌, సుధీర్‌ సాగ్వాన్‌ తో పాటు క‌ర్లీస్ రెస్టారెంట్ య‌జ‌మాని ఎడ్విన్ న్యూన్స్‌, డ్రగ్‌ సప్లయర్లు దత్తప్రసాద్‌ గోయంక‌ర్‌, రమాకాంత్ మాండ్రేకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పీఏలకు 10 రోజులు, మిగతా ముగ్గురిని 5 రోజుల పోలీసు కస్టడీకి పనాజీ కోర్టు అనుమతించింది. దీంతో పోలీసుల విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వాస్తవానికి సోనాలితో తన పీఏ అయిన సుధీర్‌ సాగ్వాన్‌ బలవంతంగా డ్రింక్‌ తాగించినట్టు CCTV దృశ్యాల్లో రికార్డ్ అయ్యాయి. ఆమె వారిస్తున్నా పట్టించుకోకుండా డ్రింక్‌ను తాగించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె పీఏల పైనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సోనాలిపై పీఏలు ఇద్దరూ అత్యాచారం చేసి ఆ తర్వాత చంపారని ఆరోపిస్తున్నారు. వాళ్లిద్దరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇటు విచారణలో సోనాలి పీఏల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. సోనాలీ చనిపోవడానికి ముందు డ్రగ్ డీలర్ దత్తప్రసాద్ గోయంకర్ ఉంటున్న క్లబ్‌‌కు వెళ్లిందని గోయంకర్‌ నుంచి తాము డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆమె సహాయకులు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఆ డ్రింక్‌ను వారే బలవంతంగా సోనాలితో తాగించినట్టు కూడా నిందితులు ఒప్పుకున్నారని వివరించారు. ఇటు సోనాలి ఉన్న గదిలో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు సోనాలి కుమార్తె, కుటుంబ సభ్యులు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని గోవా సీఎం సావంత్‌కు హర్యానా సీఎం కట్టర్ విజ్ఞప్తి చేశారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని సావంత్ స్పష్టం చేశారు. త్వరలోనే సీబీఐ విచారణ కోసం కేంద్రానికి అధికారికంగా సావంత్ సిఫార్సు చేయనున్నారు. దీంతో సీబీఐ విచారణలో నిజా నిజాలు బయటకు వస్తాయని సోనాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories