ఆర్జీ కర్‌ ఆసుపత్రి ఘటనపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిన సీబీఐ

సీబీఐ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Aug 2024 10:55 AM IST
CBI Submits Kolkata murder report in Supreme Court
X

ఆర్జీ కర్‌ ఆసుపత్రి ఘటనపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిన సీబీఐ

RG Kar Medical College: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది సీబీఐ. సీల్డ్‌ కవర్‌లో స్టేటస్‌ రిపోర్ట్‌ను సీబీఐ.. కోర్టుకు సమర్పించింది. దర్యాప్తు పురోగతిని నివేదికలో పొందుపర్చింది సీబీఐ. ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ విధ్వంసానికి సంబంధించిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు.

సీబీఐ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందజేశారు. అందులో నిందితుడు సంజయ్ రాయ్‌ను విచారించడంతోపాటు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను విచారించిన సందర్భంగా వెల్లడించిన విషయాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story