Sudan: ఫైలెట్ పై పిల్లి దాడి

Sudan: పిల్లి పైలట్‌పై దాడి చేయడంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ లాండింగ్‌ చేశారు.

Kranthi
Updated on: 5 March 2021 10:36 AM IST
Cat Attack on Pilot in Sudan
X

ఫైల్ ఇమేజ్


సుడాన్ : పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్న సామెతె తెలుగులో వుండనే వుంది. పిల్లితో ఓ ఫైలెట్ ఫైట్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..కాక్‌పిట్‌లోకి వచ్చిన పిల్లి పైలట్‌ పై దాడి చేయడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సుడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లో ఈ ఘటన జరిగింది. టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం బుధవారం ఖార్టూమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్‌కు బయలుదేరింది. విమానం బయలుదేరిన వెంటనే పిల్లి ని గుర్తించిన ఫైలెట్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎదురు తిరిగిన పిల్లి ఫైలెట్ పై ఎదురుదాడికి తిరిగింది. దీంతో చేసేదేమి లేక విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు సదరు ఫైలెట్.

విచారణ చేపట్టిన అధికారులు...

అయితే ఆ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో అన్న దానిపై స్పష్టత లేదు. విమానాశ్రయంలో రాత్రి సమయంలో ఆ పిల్లి అక్కడికి వచ్చి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు. రాత్రి విమానాన్ని శుభ్రం చేసే సమయంలో ఆ పిల్లి అక్కడే నక్కి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ ఘటనపై టార్కో ఏవియేషన్‌ ఇప్పటివరకు స్పందించలేదు.

Kranthi

Kranthi

Next Story