Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు

Rahul Gandhi: కేంద్ర హోం మంత్రికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ

Jyothi
Updated on: 25 Jan 2024 9:30 AM IST
Case against Rahul Gandhi Bharat Jodo Nyay Yatra in Assam
X

Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు  

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై అసోంలో కేసు నమోదైంది.. కాంగ్రెస్ కార్యకర్తలు గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటుచేశారు. అయినప్పటికీ దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అయితే.. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రికి ఖర్గే లేఖ రాశారు. రాహుల్ యాత్రకు సంబంధించి.. భద్రత కల్పించడంలో.. అసోం పోలీసులు విఫలమయ్యారని.. ఖర్గే లేఖలో పేర్కొన్నారు. అయితే.. కేసును తాజాగా.. సీఐడీకి అప్పగిస్తూ.. అసోం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Jyothi

Jyothi

Next Story