Dr Gaurav Gandhi: 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్‌.. గుండెపోటుతో మృతి..

Cardiologist Dr Gaurav Gandhi Dies Due To Heart Attack
x

Dr Gaurav Gandhi: 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్‌.. గుండెపోటుతో మృతి..

Highlights

Dr Gaurav Gandhi: గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినగానే అందరూ హ‌డ‌లిపోతున్నారు.

Dr Gaurav Gandhi: గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినగానే అందరూ హ‌డ‌లిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ ఫేమస్ కార్డియాలజిస్ట్ 41 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. హృద్రోగ సమస్యలు ఉన్న 16 వేల మందికిపైగా బాధితులకు కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ ఆపరేషన్స్ చేశారు.

పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూలానే డాక్టర్‌ గాంధీ సోమవారం రాత్రి ఆస్పత్రిలో తన పని ముగించుకొని ప్యాలెస్‌ రోడ్‌లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. రోజూ ఉదయం ఆరు గంటలకల్లా నిద్రలేచేవారని, మంగళవారం ఉదయం ఆరు గంటలు దాటినా.. లేవకపోవడంతో ఆయన్ను దగ్గరకు వెళ్లి పిలవగా స్పందించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఆయన్ను కదిలించి చూడగా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలించామని.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

మరోవైపు సుమారు 16 వేలకుపైగా గుండె ఆపరేషన్లు చేసి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడిన కార్డియాలజిస్ట్‌ గౌరవ్‌ గాంధీ, 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోవడం గురించి తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులతోపాటు తోటి డాక్టర్లు షాక్‌ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories