ఉత్తరాఖండ్‌‌లో భారీ రోడ్డు ప్రమాదం.. రామ్‌నగర్‌లోని ధేలా నదిలో కొట్టుకుపోయిన కారు

*కారులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి

Rama Rao
Published on: 8 July 2022 10:39 AM IST
Car falls into River in Uttarakhand
X

ఉత్తరాఖండ్‌‌లో భారీ రోడ్డు ప్రమాదం.. రామ్‌నగర్‌లోని ధేలా నదిలో కొట్టుకుపోయిన కారు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 11 మందితో వెళ్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. బాధితులందరూ పంజాబ్‌కు చెందిన వారుగు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మొత్తం 11 మంది ప్రయాణికుల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగతా 9 మందీ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. కార్బెట్ జాతీయ పార్కులోని ధేలా జోన్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story