బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి.. ఘటన జరిగిన సమయంలో ఆఫీస్‌లోనే రిషీ సునక్..

Car Crashes into UK PM Rishi Sunak Downing Street Home Gates
x

బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి.. ఘటన జరిగిన సమయంలో ఆఫీస్‌లోనే రిషీ సునక్..

Highlights

Rishi Sunak: ప్రధాని కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం

Rishi Sunak: లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధాని అధికార నివాసం గేట్లను ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. ఘటన జరిగిన సమయంలో ప్రధాని రిషి సునాక్ తన ఆఫీసులోనే ఉన్నారు. విషయం తెలిసిన రిషి తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

సాయంత్రం 4 గంటలా20నిమిషాల సమయంలో నిందితుడు తన కారుతో గేట్లను ఢీకొట్టాడని పోలీసులు చెప్పారు. నిందితుడిపై నేరపూరితంగా ఆస్తినష్టం కలిగించడం, ప్రమాదకరంగా వాహనం నడపడం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగాక కొంత సేపు ప్రధాని కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు ఆ తరువాత సడలింపులు ప్రకటించారు. నిందితుడిని పోలీసులు జైలుకు తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అమెరికాలోనూ ఇటీవల ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపేస్తానంటూ సాయి వర్షిత్ అనే భారతీయ సంతతి యువకుడు పెద్ద ట్రక్‌ తోలుకుంటూ అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ పరిసరాల్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న బారికేడ్లు ధ్వంసం చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో నిందితుడికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories