Accident: గుజరాత్‌లో కారు బీభత్సం

Accident: ఆరావళిలో పాదచారులపైకి దూసుకెళ్లిన కారు

Jyothi
Updated on: 2 Sept 2022 12:23 PM IST
Car Accident In Gujarat | Telugu News
X

Accident: గుజరాత్‌లో కారు బీభత్సం

Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆరావళి జిల్లాలోని కృష్ణాపూర్, మాల్‌పూర్ గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. మృతులు దాహోద్​జిల్లాలోని లిమ్‌‌ఖేడా, ఆరావళి జిల్లాలోని కృష్ణాపూర్‌కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వీరందరూ బనాస్​కాంఠా జిల్లాలోని అంబాజీ ఆలయానికి వెళ్తున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇన్నోవా కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. కొందరు గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


Jyothi

Jyothi

Next Story