West Bengal Election: ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు బెంగాల్‌ను అప్పగించబోము..

West Bengal Election: ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు బెంగాల్‌ను అప్పగించేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు.

Arun Chilukuri
Updated on: 22 April 2021 9:45 PM IST
Cant Surrender Bengal To Two Goons Of Delhi says Mamata Banerjee
X

West Bengal Election: ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు బెంగాల్‌ను అప్పగించబోము...

West Bengal Election: ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు బెంగాల్‌ను అప్పగించేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. దక్షిణ దీనాజ్‌పూర్‌లో జరిగిన టీఎంసీ ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. తాను క్రీడాకారిణిని కాదని, అయితే ఎలా ఆడాలో తనకు తెలుసని చెప్పారు. లోక్‌సభలో అంతకుముందు తాను ఉత్తమ క్రీడాకారిణినని తెలిపారు మమత. మోడీ, అమిత్‌షాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇద్దరు ఢిల్లీ గూండాలకు బెంగాల్‌ను అప్పగించబోమన్నారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆరవ విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకే 80 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా నమోదు అవుతోంది. ఇప్పటికే ముగిసిన ఐదు విడతల పోలింగ్‌లో సగటున 80 శాతానికి పైగానే ఓటింగ్ మోదైంది. ఈ విడతలో మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరిగింది. బెంగాల్‌లో మరో రెండు విడతల పోలింగ్‌ మిగిలి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story