లాక్ డౌన్ ఒక్కటే భారత్ కు శ్రీరామరక్ష అంటున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ! ఎందుకంటే..

లాక్ డౌన్ ఒక్కటే భారత్ కు శ్రీరామరక్ష అంటున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ! ఎందుకంటే..
x
Highlights

ఈ నెల 14న లాక్ డౌన్ ముగియనుంది. అయితే, లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తుందా లేదా అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకు కరోనా...

ఈ నెల 14న లాక్ డౌన్ ముగియనుంది. అయితే, లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తుందా లేదా అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి, అలాగే మృతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో లాక్ డౌన్ ను పొడిగిస్తారు అని అంటూ కొందరు వాదిస్తుండగా, ప్రజల కష్టాలు దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ ను ఎత్తేస్తారు అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పరిశోధకుల అంచనా ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ పొడిగింపే భారత్ కు శ్రీరామరక్ష అని స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తారా? లేదా? అన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేయడం ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ను నియంత్రించాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ సరిపోదని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన 'సెంటర్‌ ఫర్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌' పరిశోధకుల బృందం అంచనావేసింది. ఇప్పడు ఎత్తివేస్తే కేసులు ఉద్ధృతమవుతాయని హెచ్చరించింది.

భారత్ లో ఈ నెల 14న లాక్ డౌన్ కు ఐదురోజులు విరామం ఇచ్చి మరో 28 రోజులపాటు పొడిగించినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఆ తర్వాత కూడా కేసులు పుంజుకుంటాయని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ స్పష్టంచేసింది. ఏకబిగిన 49 రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగిస్తేనే వైరస్‌ను అదుపులోకి తేవొచ్చని అభిప్రాయపడింది.

లాక్ డౌన్ కు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ మరో ప్రత్యామ్నాయం కూడా సూచించింది. 21రోజుల గడువు ముగిసిన తర్వాత మరో రెండు విడతలుగా లాక్‌డౌన్‌ అమలుచేయొచ్చని తెలిపింది. తొలుత 28రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించి, ఆ తర్వాత ఐదు రోజులు విరామమిచ్చి, మళ్లీ 18 రోజులపాటు లాక్‌డౌన్‌ అమలుచేయాలని సూచించింది. దీని ద్వారా వైరస్‌ను కట్టడి చేసేందుకు వీలవుతుందని తెలిపింది.

కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపవచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వొచ్చని అంటున్నారు. వ్యవసాయ కార్యకలాపాలకు మినహాయింపునివ్వొచ్చని, విమాన సర్వీసులు పాక్షికంగా ప్రారంభం కావొచ్చని, వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల వరకే పూర్తి లాక్‌డౌన్‌ పరిమితం అవ్వొచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతకు ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత దృష్టిసారించిన 10 ప్రాధాన్యతా అంశాలను రూపొందించాలని కోరారు. వాణిజ్యం కొనసాగింపు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories